ఆంధ్రజ్యోతిపై విరుచుకుపడి వైయస్ జగన్ సాక్షి డైలీ

రాష్ట్రంలోనూ జాతీయంగానూ దయనీయంగా ఉండి, స్కామ్‌లూ అంతర్గత కల్లోలంతో అప్రతిష్టపాలు అయిన కాంగ్రెసులోకి జగన్ ఎలా వెళ్తారని సాక్షి పత్రిక ప్రశ్నించింది. మునిగే కాంగ్రెసులోకి వెళ్తారన్న రాతలు చూసి ప్రజలు నవ్వుతున్నారంటూ వ్యాఖ్యానించింది. సిఎన్ఎన్ - ఐబియన్ చానెల్‌కు జగన్ పరిణతితో కూడా ప్రకటనలు ఇచ్చారని, అయినా పచ్చ మీడియా వక్రీకరణలకు పూనుకుంటోందని అభిప్రాయపడింది. జగన్ వైఖరి కొత్తదేమీ కాదని, కడప ఉప ఎన్నికల సమయంలోనే ఆ విషయం చెప్పారని గుర్తు చేసింది.
రాష్ట్ర ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తూ జాతీయ స్థాయిలో అవసరమైతే ములాయం సింగ్, మమతా బెనర్జీ, శరద్ పవార్ వంటివారితో కలిసి పనిచేయడానికి జగన్ సిద్ధంగా ఉంటారని చెప్పింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ తుడిచిపెట్టుకు పోతుందని సర్వేలు చెబుతున్నాయని రాసింది.












Click it and Unblock the Notifications