నాకు ప్రాణహాని ఉంది: విజయసాయి రెడ్డి ఫిర్యాదు

జగన్ నుంచి, ఇతర కంపెనీల నుంచి తనకు ముప్పు ఉందంటూ ఒక మీడియా సంస్థ దుష్ప్రచారం చేస్తోందని, టిడిపి శానససభ్యుడు పయ్యావుల కేశవ్ కూడా మీడియా ముందు ఇవే ఆరోపణలు చేశారని ఆయన అన్నారు. తనకు హాని చేసి దాన్ని జగన్ పనిగా చూపించి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. సిబిఐ విచారణకు వెళ్తున్న సమయంలో కొంత మంది తనను అనుమానంగా చూస్తున్నట్లు తనకు అనుమానం కలుగుతోందని ఆయన అన్నారు.
తనకు ప్రమాదం పొంచి ఉందని కొందరు రాజకీయ నాయకులు చేస్తు్న ప్రచారం వెనక కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. జగన్ కంపెనీల్లో పెట్టుబడుల పేరుతో జరుగుతున్న ప్రచారం నిరాధారమైందని, జగన్ కంపెనీల వ్యవహారాలన్నీ పారదర్శకంగానే ఉన్నాయని ఆయన అన్నారు. ఏ విధమైన తప్పు జరగలేదనే నిజం ఏనాటికైనా రుజువు అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications