మరో ముగ్గురు జగన్ వర్గం ఎమ్మెల్యేలు వెనక్కి

కడప, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ఒక్కరేసి ఎమ్మెల్యే రాజీనామాల నుంచి వెనక్కి మళ్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుత స్థితిలో తాము రాజీనామాలను ఆమోదింపజేసుకోవడానికి సిద్ధంగా లేమని వారంటున్నట్లు తెలుస్తోంది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఆ ప్రతిపాదనను ముందుకు తెచ్చారని అంటున్నారు. ఆ ఎమ్మెల్యేకు వైయస్ జగన్ ఒత్తిడి కారణంగానే 2009 ఎన్నికల్లో కాంగ్రెసు టికెట్ లభించింది. ఉప ఎన్నికలకు వెళ్లాలని జగన్ ఒత్తిడి పెంచితే మరింత మంది శాసనసభ్యులు వెనక్కి తగ్గవచ్చునని అంటున్నారు. కడప శాసనసభ్యుడు తాను ఏ పరిస్థితిలో రాజీనామా చేయాల్సి వచ్చిందనే విషయాన్ని స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు వివరించారని అంటున్నారు. ఈ వాదనతో రాజీనామాలను తిరస్కరించే అవకాశం స్పీకర్‌కు లభించిందని చెబుతున్నారు.
సిబిఐ ఎఫ్ఐఆర్‌లో చేర్చినందుకు నిరసనగా 26 మంది శాసనసభ్యులు రాజీనామాలు చేసిన వెంటనే జగన్ వర్గంలో విభేదాలు పొడసూపాయని అంటున్నారు. తమ రాజీనామాల వల్ల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కూలిపోయే స్థితి లేకపోవడంతో కొంత మంది తీవ్ర అసంతృప్తికి గురై, రాజీనామాలు సమర్పించినందుకు బాధపడ్డారని అంటున్నారు. ప్రభుత్వాన్ని కూల్చలేనప్పుడు రాజీనామాలు చేయడం అనవసరమని కూడా వాదించారని చెబుతారు.












Click it and Unblock the Notifications