తిరిగి పార్టీ పనిలో పడిన సోనియా, కార్యకర్తలకు దూరమే

షాల్వార్ కమీజు ధరించి ఆమె సమావేశంలో దర్శనమిచ్చారు. సోనియా ఆరోగ్యంగానే ఉన్నారని, అయితే వైద్యుల సలహా మేరకు మరింత కాలం పూర్తి స్థాయి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటారని ఎఐసిసి అధికార ప్రతినిధి జనార్దన్ ద్వివేది చెప్పారు. మునుపటి లాగే ఆమె ప్రధానిని ఆహ్వానించారని ఆయన చెప్పారు. సోనియా ఎప్పటిలాగే పనిలో పడడం ఆనందంగా ఉందని పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ చెప్పారు. సోనియా ఆరోగ్యం కుదుటపడిందని, ఆమె ఉత్సాహంగా కార్యక్రమాల్లో పాల్గొంటారని అంబికా సోనీ అన్నారు. ఈ నెల 8వ తేదీన ఢిల్లీ తిరిగి వచ్చిన తర్వాత పార్టీ సహచరులను సోనియా కలుసుకోవడం ఇదే తొలిసారి.












Click it and Unblock the Notifications