తెలంగాణపై బొత్స వ్యాఖ్యలతో విభేదించిన కోదండరామ్

సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం వాటిని మరింత పెంచే ప్రయత్నాలు చేయవద్దన్నారు. తెలంగాణకు ఎక్కడా న్యాయం జరగలేదన్నారు. కాగా సకల జనుల సమ్మెకు మద్దతుగా తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలలను మూసివేశారు. ఇందిరాపార్కు వద్ద తెలంగాణ లెక్చరర్ల ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన చేశారు. పలు జిల్లాల్లో విద్యార్థులతో మానవహారం నిర్వహించారు. నల్గొండ జిల్లాలో వెలుగు కార్యాలయంలో అధికారి విధులకు హాజరు కావడంతో తెలంగాణవాదులు ఆయనను బలవంతంగా కార్యాలయం నుండి పంపించేసి తాళం వేశారు. వర్తక, వాణిజ్య, వ్యాపార సంఘాలు స్వచ్చందంగా సకల జనుల సమ్మెలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications