సిబిఐ విచారణ: బళ్లారికి ఒఎంసి డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి

CBI
హైదరాబాద్: అక్రమ గనుల కేసులో ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి) మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డిని సిబిఐ అధికారులు రాత్రికి రాత్రి కర్ణాటకలోని బళ్లారికి తరలించారు. కేసు దర్యాప్తులో భాగంగా ఆయనను బళ్లారికి తరలించారు. బళ్లారిలో ఆయనను పరమదేవనహళ్లి పోలీసు స్టేషనులో ఉంచారు. బళ్లారిలో శ్రీనివాస రెడ్డికి చెందిన యాక్సిస్ బ్యాంక్ ఖాతాలను సిబిఐ అధికారులు ఆయన సమక్షంలో తెరిచే అవకాశం ఉంది. మిగతా బ్యాంకు ఖాతాలను కూడా తెరిచి సిబిఐ అధికారులు పరిశీలిస్తారని అంటున్నారు.

కాగా, గాలి జనార్దన్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి విచారణలో సిబిఐ అధికారులకు డొంక తిరుగుడు సమాధానాలు ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏదైనా అడిగితే ఆ సంతకం తనది కాదని, ఫోర్జరీ చేశారేమోనని గాలి జనార్దన్ రెడ్డి సమాధానం ఇస్తున్నారని సమాచారం. శ్రీనివాస రెడ్డి కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఏదైనా అడిగితే గుర్తు లేదని, గుర్తుకు వచ్చిన తర్వాత చెబుతానని అంటున్నారని తెలుస్తోంది. వారి తీరుతో సిబిఐ అధికారులు తీవ్ర అసహనానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. ముందే సిబిఐ అధికారులు ఆధారాలను సేకరించి పెట్టుకున్నారు. వాటి ఆధారంగా ప్రశ్నలు రూపొందించుకుని గాలి జనార్దన్ రెడ్డిని, శ్రీనివాస రెడ్డిని విచారిస్తున్నారు. అయితే, వారిద్దరి నుంచి కూడా సరైన సమాధానాలు రావడం లేదని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+