గాలి మైనింగ్ కేసులో మరో ముగ్గురికి సిబిఐ నోటీసులు

ఆ ముగ్గురి పేరు మీద గాలి జనార్దన్ రెడ్డి ఆర్థిక లావాదేవీలు నిర్వహించారని సిబిఐ అధికారులు అనుమానిస్తున్నట్లు సమాచారం. కాగా, గాలి జనార్దన్ రెడ్డిని, శ్రీనివాస రెడ్డిని మరో వారం రోజుల పాటు తమ కస్టడీకి కోరుతూ సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గాలి జనార్దన్ రెడ్డి కస్టడీలో ఉండడం వల్ల సాక్షుల్లో నమ్మకం పెరిగిందని, స్వచ్ఛందంగా వారు ముందుకు వస్తున్నారని సిబిఐ అంటోంది. గాలి జనార్దన్ రెడ్డి కంపెనీలు విదేశాల్లో కూడా ఉన్నాయని, వాటి వివరాలు రాబట్టాల్సి ఉందని చెబుతోంది. మొత్తం మీద, గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో సిబిఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. గాలి జనార్దన్ రెడ్డిని, శ్రీనివాస రెడ్డిని సిబిఐ అధికారులు సోమవారం నాంపల్లి కోర్టు ముందు హాజరు పరిచిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications