జగన్ ఆస్తులపై సిబిఐ దర్యాప్తు వేగం తగ్గిందా?

వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ ఢిల్లీ యాత్రకు ముందు ఆయన ఆస్తులు, అక్రమాల విషయమై సీబీఐ విచారణ వేగంగా జరిగిందని, జగన్ ఢిల్లీ యాత్ర తర్వాత నెమ్మదించినట్లుందని తెలుగుదేశం పార్టీ నేత ఇనుగాల పెద్దిరెడ్డి అన్నారు. ఢిల్లీ నుంచి వచ్చాక జగన్ స్వరంలో కూడా మార్పు వచ్చిందని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును విమర్శించడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆస్తులు ప్రకటించిన చంద్రబాబును విమర్శించడం మాని, తాను కూడా ఆస్తులు ప్రకటించాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications