గాలి జనార్ధన్ రెడ్డి అనుచరుల ఇళ్లలో సిబిఐ సోదాలు

కాగా ఓబుళాపురం మైనింగ్ కేసులో ఇప్పటికే కర్నాటక మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ శాసనసభ్యుడు గాలి జనార్ధన్ రెడ్డి, ఓఎంసి ఎండి శ్రీనివాస్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు మరో ఇద్దరిని అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మైనింగ్ వ్యవహారాల్లో కీలక భూమిక పోషించిన ఆ ఇద్దరిని అరెస్టు చేసి విచారిస్తే కేసులో మరింత పురోగతి ఉంటుందని సిబిఐ అధికారులు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. కాగా గాలి జనార్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిల సిబిఐ కస్టడీ సోమవారంతో ముగుస్తోంది. దీంతో సిబిఐ అధికారులు 10.30 గంటలకు నాంపల్లి ప్రత్యేక కోర్టులో వారిని హాజరు పర్చనున్నారు.
గాలి, శ్రీనివాస్ రెడ్డిలను మరో వారం రోజులు తమ కస్టడీకి అప్పగించాలని సిబిఐ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వారిని కోర్టు సిబిఐ కస్టడీకి అప్పగించిన సమయంలోనే సిబిఐ జెడి లక్ష్మీ నారాయణ విచారణకు వారం రోజులు సరిపోక పోవచ్చునని చెప్పారు. మరోవైపు గాలి తరఫు న్యాయవాదులు గాలి, శ్రీనివాస్ రెడ్డిలకు బెయిల్ ఇవ్వాల్సిందిగా పిటిషన్ వేశారు.












Click it and Unblock the Notifications