తెలంగాణ సమ్మెపై రేణుకా చౌదరి సెటైర్లు

ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని తెలంగాణవాదులు సకల జనుల సమ్మెను విరమించుకోవాలన్నారు. లేదంటే ప్రజలు అసహ్యించుకుంటారన్నారు. సిడబ్లుసిలో అత్యున్నత పదవులు అనుభవించిన వారు సైతం అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడటం సరికాదన్నారు. వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ తర్వాత సిబిఐ దర్యాఫ్తు మందగించిందనడం అవాస్తవమన్నారు. సిబిఐ దర్యాఫ్తు మందగించలేదన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి దీక్ష పైనా ఆమె వ్యంగ్యాస్త్రాలు సందించారు. మోడి తన బరువును తగ్గించుకోవడానికే సద్భావన దీక్ష చేపట్టారన్నారు. తాను కూడా తన బరువు తగ్గించుకోవడానికి దీక్ష చేయడంపై ఆలోచిస్తానన్నారు.












Click it and Unblock the Notifications