జయసుధ సహా అందరూ జగన్ వెంటే: గుర్నాథ్ రెడ్డి

కాగా ఈ నెల 13వ తారీఖున పరకాల శాసనసభ్యురాలు కొండా సురేఖ, భద్రాచలం ఎమ్మెల్యే కుంజా సత్యవతితో పాటు జయసుధ రాజీనామా చేయని విషయం తెలిసిందే. ప్రస్తుతం తాను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయనని, రాజీనామాలు ఓ డ్రామాలాగా కనిపిస్తున్నాయని, రాజీనామాలు ఖచ్చితంగా ఆమోదిస్తారనే అభిప్రాయానికి వచ్చినప్పుడే తాను రాజీనామా చేస్తానని చెప్పి జగన్ వర్గానికి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.
కాగా అధికార కాంగ్రెసు ప్రభుత్వం చేనేత కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని వైయస్సార్సీ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. దివంగత వైయస్ హయాంలో చేనేత కార్మికులకు ప్రాధాన్యమిచ్చారని కానీ ఇప్పటి ప్రభుత్వం వారిని నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. వైయస్ హయాంలో చేనేతకు మూడువేల కోట్లు కేటాయిస్తే ఇప్పటి ప్రభుత్వం కేవలం 110 కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు.












Click it and Unblock the Notifications