రేణుకా చౌదరి సమైక్యవాది: నాగం జనార్ధన్ రెడ్డి

నిజాం కళాశాలలో చదివిన ముఖ్యమంత్రి అదే నిజాం కళాశాలలో చదువుతున్న విద్యార్థులపై లాఠీఛార్జ్ జరిపిస్తారా అని తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు వేరుగా ప్రశ్నించారు. లాఠీఛార్జ్‌కు బాధ్యులైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెబుతున్నట్టుగా ఆర్టీసి, ఉద్యోగులది రెండు రోజుల సమ్మె కాదని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు అన్నారు. తెలంగాణ వచ్చే వరకు నిరవధిక సమ్మె చేస్తున్నారన్నారు. ప్రభుత్వ బెదిరింపులకు కాంట్రాక్టు ఉద్యోగులు భయపడవద్దన్నారు. రేణుకా చౌదరికి దమ్ముంటే హైదరాబాద్ వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు.












Click it and Unblock the Notifications