హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎనిమిదో రోజు కొనసాగుతున్న తెలంగాణ సమ్మె

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా సకల జనుల సమ్మె మంగళవారం ఎనిమిదో రోజు కొనసాగుతోంది. తెలంగాణ ఆర్టీసి జెఏసి రెండో రోజు విధుల బహిష్కరణ చేస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా బస్సులు ఎక్కడికక్కడే నిలిచి పోయాయి. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచి పోయింది. సమ్మె రోజు రోజుకు ఉధృతమవుతోంది. తెలంగాణలోని అన్ని డిపోలకు తాళాలు వేశారు. తెలంగాణ అర్చకులు ఉద్యమంలో పాలు పంచుకున్నారు. అయితే ఆర్టీసి అధికారులు కొన్ని బస్సులను నడిపేందుకు చేసిన ప్రయత్నాలను ఆయా జిల్లాల్లోని ఆర్టీసి జెఏసిలు అడ్డుకున్నాయి. కాగా మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుండి సుమారు 50 బస్సులను ఆర్టీసి అధికారులు గట్టి భద్రతతో వివిధ ప్రాంతాలకు పంపించారు. నగరంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనకుండా ఉండేందుకు సెట్విన్ బస్సులను పెంచటంతో పాటు సెవెన్ సీటర్ ఆటోలను పట్టణంలోకి అనుమతించారు.

పోలీసు భద్రత మధ్య కొన్ని ఆర్టీసీ బస్సులను ఆర్టీసీ అధికారులు తిప్పుతున్నప్పటికీ ఎక్కువ శాతం డిపోలకే పరిమితమయ్యాయి. కరీంనగర్ తదితర జిల్లాల్లో ఆర్టీసి అధికారులు బస్సులు బయటకు తీసేందుకు చేసే ప్రయత్నాలను ఆర్టీసి జెఏసి అడ్డుకొంది. నిజాం కళాశాలలో సోమవారం విద్యార్థులపై పోలీసుల దాష్టీకాన్ని నిరసిస్తూ విద్యార్థులు మంగళవారం కళాశాల ప్రిన్సిపల్‌ను అడ్డుకున్నారు. ప్రిన్సిపల్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. విద్యార్థులపై పోలీసుల దాష్టీకానికి బాధ్యత వహిస్తూ ప్రిన్సిపల్ అశోక్ నాయుడు విద్యార్థులకు క్షమాపణ చెప్పి వారి సమక్షంలో రాజీనామా చేశారు. బాధిత విద్యార్థులను కోదండరాం పరామర్శించారు.

English summary
Sakala Janula Strike is continuing on eigth day today in Telangana region.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X