రాపాయికే కిలో బియ్యం: ముఖ్యమంత్రి వెల్లడి

కామధేను పథకం కింద చిత్తూరు జిల్లాలో పది వేల ఆవులను పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో ప్రతి గ్రామానికీ మంచినీరు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇందుకు నాలుగు కోట్ల రూపాయలతో ఓ ప్రణాళికను రూపొందించినట్లు ఆయన తెలిపారు. నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి రాజీవ్ యువకిరణాలు పథకాన్ని రూపొందించినట్లు ఆయన తెలిపారు. మహిళలకు రూ. 470 కోట్ల మేరకు పావలా వడ్డీ రుణాలు ఇవ్వడంతో పాటు ప్రతి మండలంలో స్త్రీనిధి బ్యాంకును ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి కూడా పాల్గొన్నారు. స్వయం సహాయక గ్రూపు మహిళలతో ఆయన మాట్లాడారు.












Click it and Unblock the Notifications