లాబీయింగ్ కిటుకేంటో చెప్పండి: సిఎంకు పొన్నం

బుధవారం రాత్రి భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ ఇంట్లో గుత్తా సుఖేందర్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు భేటీ అయ్యారు. తెలంగాణ ఉద్యమంపై, సకల జనుల సమ్మె తదితర అంశాలపై వీరు చర్చించినట్లుగా తెలుస్తోంది. చర్చించిన అనంతరం వీరు మీడియాతో మాట్లాడారు. కేంద్రం తెలంగాణ ఇచ్చి తీరుతుందన్నారు. కాగా అంతకుముందు ఎంపీ రాజగోపాల్ రెడ్డి ఇబ్రహీంపట్నంలో జరిగిన సకల జనుల సమ్మెకు మద్దతు తెలపడానికి వెళ్లారు. ఆయనను జెఏసి నాయకులు ఘెరావ్ చేశారు. రాజగోపాల్ రెడ్డి గో బ్యాక్ అంటూ నిరసన తెలిపారు. వేదికపైకి ఎక్కి ప్రసంగించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలను అడ్డుకున్నారు.












Click it and Unblock the Notifications