తెలంగాణ కోసం చస్తాం అవసరమైతే కూలుస్తాం: కాంగ్రెసు

తెలంగాణ కోసం తాము ప్రభుత్వాన్ని కూల్చడానికి కూడా సిద్ధంగా ఉన్నామని మాజీ మంత్రి దామోదర్ రెడ్డి హెచ్చరించారు. పదవి ఎలా తెచ్చుకున్నారని అడిగితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఆగ్రహం వచ్చిందని ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. గ్రూప్ వన్ మెయిన్స్ వాయిదా వేయించే బాధ్యత మంత్రుల పైనే ఉందన్నారు. ఇన్నాళ్లూ తెలంగాణ తెచ్చేది మేమే ఇచ్చేది మేమే అని చెప్పామని ఒకవేళ తెలంగాణ తేకుంటే చచ్చేది కూడా తామే అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరాం పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications