డిఎంకె మాజీ మంత్రి సామి అరెస్టు, హత్యారోపణలు

చెల్లాదురై భార్య పోలీసు కమిషనర్ జెకె త్రిపాఠీకి తన భర్త కనిపించడం లేదని ఆగస్టులో ఫిర్యాదు చేసింది. దాంతో అదృశ్యం కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేశారు. దీంతో చెల్లాదురై హత్య వెలుగులోకి వచ్చింది. కెపిపి సామి సోదరులు, అనుచరులు తన భర్తను వాహనంలోకి బలవంతంగా ఎక్కించడాన్ని చాలా మంది చూశారని, అప్పటి నుంచే తన భర్త కనిపించడం లేది చెల్లాదురై భార్య ఫిర్యాదు చేసింది.
పోలీసులు మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చి ఇంతకు ముందు ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ కేసులో నలుగురు అనుమానితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, కెపిపి సామి సోదరులు కెపిపి శంకర్, కెపిపి చొక్కలింగం నెల క్రితం మెజిస్ట్రేట్ కోర్టు ముందు లొంగిపోయారు.












Click it and Unblock the Notifications