కెసిఆర్ పీక్కుతింటూ దండుకుంటున్నారు: లగడపాటి

Lagadapati Rajagopal
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఆయన కుటుంబ సభ్యులు తెలంగాణ ఉద్యమం పేరుతో
ప్రజలను పీక్కు తింటున్నారని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ మంగళవారం విమర్శించారు. వారు రాబందులను వారి కబంద హస్తాల నుండి తెలంగాణ ప్రజలు విముక్తులు కావాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యమం పేరుతో అమాయకులను బలి చేస్తున్నారని విమర్శించారు. కెసిఆర్ వైఖరి వల్ల కోట్లాది తెలంగాణ బీద, అమాయక ప్రజలు నానాయాతలు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. అమాయకులను రెచ్చగొడుతున్నారన్నారు. రాష్ట్రంలోని ఉద్యోగుల్లో అధిక శాతం మంది తెలంగాణలోనే ఉన్నారని అవసరమైతే లెక్కలు చూపిస్తానన్నారు. ప్రజలను రెచ్చగొట్టే వారిపై పోలీసులు కేసులు పెట్టాలని సూచించారు. అమాయకులపై దాడులు చేయడానికి సిగ్గు, శరం ఉందా అని ధ్వజమెత్తారు. కెసిఆర్ చాలా నీచంగా మాట్లాడుతున్నారన్నారు.

దొరలు అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజలు నరకం చూస్తారన్నారు. అప్పట్లో భూస్వాముల కబంద హస్తాల నుండి ఎలా బయటపడ్డారో ఇప్పుడు కెసిఆర్ కుటుంబం కబంద హస్తాల నుండి తెలంగాణ ప్రజలు అలాగే బయటపడాలన్నారు. ముఖ్యమంత్రి అరాచక శక్తులను అదుపులో పెట్టడానికి పోలీసులకు స్వేచ్ఛ ఇవ్వాలని సూచించారు. నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీకి రాజకీయ జీవితం ఇచ్చింది తానేనని, ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళతానంటే తానే కాంగ్రెసులోకి తీసుకు వచ్చానన్నారు. తెలంగాణపై అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా తమకు అభ్యంతరం లేదన్నారు. కాంగ్రెసు నేతలను దంచమని చెప్పడానికి కెసిఆర్ ఎవరన్నారు. కాంగ్రెసు రుచి చూపిస్తామన్నారు. పండగల సమయంలో తెలంగాణ ప్రజలు అల్లాడుతున్నారన్నారు. ఉద్యమం పేరుతో కెసిఆర్ కుటుంబం దోచుకుంటుందన్నారు. బందులు, రాస్తారోకోలతో ప్రజలకు ఇబ్బందులను అలాంటివి సీమాంధ్రలో వద్దని సూచించారు. ఆర్టీఏ కార్యాలయ ఘటనకు కెసిఆర్‌దే బాధ్యత అన్నారు.

కాగా ఎంపీ మధుయాష్కీ జోగి రమేష్ నోరు అదుపులో పెట్టుకోవాలని ఎమ్మెల్యే జోగి రమేష్ విజయవాడలో అన్నారు. ఆంధ్రా ఉద్యోగులపై తెలంగాణ ప్రజా ప్రతినిధులు దాడులు చేస్తే ఊరుకునేది లేదన్నారు. తాము హైదరాబాద్ వచ్చి వారికి రక్షణగా నిలుస్తామన్నారు. దాడులు చేసిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజాప్రతినిధులు తెరాస వ్యూహంలో పావులుగా మారుతున్నారని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+