ఖమ్మంలో ఎమ్మెల్యే అరెస్టు, రాజధానిలో పోలీసులపై రాళ్లు

హైదరాబాద్ వనస్థలిపురంలో సచివాలయానికి వెళుతున్న ఉద్యోగుల బస్సును తెలంగాణవాదులు అడ్డుకున్నారు. ఆరు బస్సుల అద్దాలను ధ్వంసం చేసారు. దుకాణాలను మూసి వేయించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకు రావడానికి పోలీసులు ప్రయత్నించారు. అయితే ఆందోళనకారులు వారి పైకి రాళ్లు రువ్వారు. పరిస్థితి అదుపు తప్పడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా సమ్మెలో సచివాలయ నాలుగో తరగతి ఉద్యోగులు సైతం పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications