లంచం తీసుకుంటూ కెమెరాకు చిక్కిన శంకరరావు

ఆ మొత్తాన్ని రెండు విడతలుగా శంకరరావు తీసుకున్నారని, రెండో విడత ఐదు లక్షల రూపాయలు తీసుకుంటూ న్యూస్ చానెల్ కెమెరాకు చిక్కారని సాక్షి దినపత్రిక రాసింది. టికెట్ ఆశించిన వ్యక్తితో జరిపిన సంభాషణలు టేపుల్లో రికార్డు అయినట్లు తెలిపింది. ఆ సంభాషణలను కూడా సాక్షి దినపత్రిక ప్రచురించింది. వైయస్ జగన్‌పై శంకరరావు రాసిన లేఖను హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించి, సిబిఐ దర్యాప్తునకు దారి తీసింది. అలాగే, హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై ఆరోపణలు చేస్తూ రాసిన లేఖను పరిగణనలోకి తీసుకుంటూ కోర్టు సిబిఐ విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే శంకరరావు లంచం తీసుకున్న టేపుల వ్యవహారాన్ని ముందుకు తెచ్చినట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications