జగన్‌కు విరుగుడుగా జెసి విభజన ప్రతిపాదన?

JC Diwakar Reddy-YS Jagan
హైదరాబాద్: కర్నూలు, అనంతపురం జిల్లాలతో కలిపి రాయల తెలంగాణను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన రాయలసీమకు చెందిన కాంగ్రెసు శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డిదనే అనుమానాలు తలెత్తుతున్నాయి. రాష్ట్రాన్ని విభజించదలుచుకుంటే రాయల తెలంగాణను తాను బలపరుస్తానని జెసి దివాకర్ రెడ్డి అనడం ఆ అనుమానాలకు తావిస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు విరుగుడుగా ఆ ప్రతిపాదన చేసినట్లు కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి చిదంబరం 2009 డిసెంబర్ 9వ తేదీన ప్రకటించిన వెంటనే సీమాంధ్ర శానససభ్యుల రాజీనామాలకు జెసి దివాకర్ రెడ్డే శ్రీకారం చుట్టారు. చాలా కాలం ఆయన సమైక్యాంధ్ర కోసం పోరాటం చేస్తున్న నేతలతో కలిసి పనిచేశారు.

క్రమంగా ఆ నాయకులకు జెసి దివాకర్ రెడ్డి దూరమవుతున్నట్లు కనిపించారు. రాయలసీమలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రాబల్యం ఎక్కువగా ఉండడంతో దానికి విరుగుడుగా అనంతపురం జిల్లాను తెలంగాణకు బదిలీ చేయడం మంచిదనే అభిప్రాయానికి ఆయన వచ్చినట్లు తెలుస్తోంది. కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలిపి రాయల తెలంగాణను ఏర్పాటు చేస్తే జగన్ ప్రాబల్యం సగానికి సగం రాయలసీమలో తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. అనంతపురం జిల్లాలో తెలుగుదేశం ప్రాబల్యానికి కూడా దానివల్ల గండి కొట్టవచ్చునని భావిస్తున్నారు. తెలంగాణ యావత్తూ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ప్రాబల్యం సాధించడంతో రాయలసీమకు చెందిన రెండు జిల్లాలను కలిపి రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే బలాబలాలు తారుమారుతాయని భావిస్తున్నారు.

రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా తమకు రాయల తెలంగాణ అనుకూలంగా అనిపించడంతో కాంగ్రెసు అధిష్టానం ఆ ప్రతిపాదనను ముందుకు తెచ్చినట్లు భావిస్తున్నారు. తాను కెసిఆర్‌తో తెలంగాణపై మాట్లాడలేదని మజ్లీస్ నేత అసదుద్దీన్ చెప్పినా నమ్మడానికి వీలు లేకుండా ఉంది. సచార్ కమిటీ నివేదికపై వివిధ పార్టీల నాయకులను కలిసే సందర్భం ఏదీ లేదనే విషయం అందరికీ తెలుసు. తన వద్దకు వచ్చిన ప్రతిపాదననే కెసిఆర్ వెల్లడించారనే నమ్మడానికి వీలవుతోంది. జెసి చేసిన ప్రతిపాదనకు కేంద్రం ఆమోద ముద్ర వేసినట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+