తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యే గంపా గోవర్ధన్ రాజీనామా

రాజీనామా లేఖను తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఫాక్స్ చేసిన తర్వాత గంపా గోవర్దన్ తెరాస శాసనసభ్యుడు కెటిరామారావుతో కలిసి మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణపై చంద్రబాబు నాయుడు వైఖరిని ఆయన విమర్శించారు. తెలంగాణకు అనుకూలంగా పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. ఎమ్మెల్యే పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. అసెంబ్లీ కార్యదర్సికి ఆయన తన రాజీనామా లేఖను ఇచ్చారు. ఉప ఎన్నికల ద్వారా శాసనసభలో తన బలాన్ని పెంచుకోవడానికి కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు.
కాగా, నిజామాబాద్ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో దెబ్బ తగిలింది. పార్టీ ఎల్లారెడ్డి నియోజకవర్గం ఇంచార్జీ నల్లమడుగు సురేందర్ కూడా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెరాసలో చేరనున్నారు. కెసిఆర్‌తో ఆయన ఇది వరకే సమావేశమయ్యారు. సురేందర్ కూడా గురువారం తెరాసలో చేరుతారు. సురేందర్ రాజీనామాతో ఎల్లారెడ్డిలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అయినట్లేనని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications