కాంగ్రెసు ఎమ్మెల్యేలకు తెలంగాణ సెగ, ఇళ్ల ముట్టడి

కాగా, తెలంగాణ సకల జనుల సమ్మె గురువారంనాడు 17వ రోజుకు చేరుకుంది. ఆర్టీసి సమ్మె 11వ రోజుకు, మెడికల్ సమ్మె 8వ రోజుకు చేరుకున్నాయి. సకల జనుల సమ్మెతో తెలంగాణ ఆర్టీసి బస్సులు చాలా వరకు నడవడం లేదు. రేపు తెలంగాణ జెఎసి ఆధ్వర్వంలో హైదరాబాదు జరగనుంది. తెలంగాణ జెఎసి నాయకులు హైదరాబాదుపై తమ దృష్టిని కేంద్రీకరించినట్లు కనిపిస్తోంది. సకల జనుల సమ్మెకు మద్దతుగా వార్తాపత్రికల హ్యాకర్లు సమ్మెకు దిగారు. వారు వార్తాపత్రికల పంపిణీని ఆపేయడమే కాకుండా ర్యాలీకి సిద్దపడ్డారు. దాంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications