అందుకే శంకర రావు మాట్లాడుతున్నారు: వైయస్ వివేకా

కాగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై జై ఆంధ్ర ఉద్యమ నేత జెటి రామారావు విశాఖపట్నంలో విరుచుకు పడ్డారు. చిత్తూరులో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, కడపలో వైయస్సార్సీ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఉత్తరాంధ్రలో పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణలు ఉన్నందునే ఆ జిల్లాలను కెసిఆర్ వద్దంటున్నారని కర్నూలు, అనంతపురంలో సిఎం పదవికి పోటీ ఎవరూ లేనందునే ఆయన ఆ జిల్లాలను ఎంచుకున్నారని విమర్శించారు. కెసిఆర్ రాజకీయ స్వార్థం దీంతో బయటపడిందన్నారు. వచ్చే నెల 7న విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఏర్పాటు చేసిన సమైక్య సభకు హాజరవుతామని చెప్పారు.












Click it and Unblock the Notifications