ఆ స్టార్ హోటల్స్ కు బిగ్ షాక్.. కోర్టుకెళ్ళి మరీ 20లక్షల జరిమానా వేయించుకున్నారుగా!

హైదరాబాద్లోని రెండు ప్రముఖ హోటల్స్ కు తెలంగాణ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. టీ జి ఎస్ పి డి సి ఎల్ విద్యుత్ క్రాస్ సబ్సిడీ సర్చార్జి డిమాండ్ నోటీసులు సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలు చేసిన రెండు పిటిషన్ల పైన విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం రిప్ పిటిషన్లు దాఖలు చేసిన హోటల్ యాజమాన్యాలకు ఊహించని షాక్ ఇచ్చింది.

రెండు ప్రముఖ హోటల్స్ కు 20 లక్షల జరిమానా

కోర్టుకు కీలక విషయాలను దాచి పెట్టి, కోర్టును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారని రెండు హోటల్స్ కు చెరో 10 లక్షలు చొప్పున మొత్తం 20 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఈ మేరకు జస్టిస్ నాగేష్ భీమపాక ఉత్తర్వులు జారీ చేశారు.

Telangana High Court dealt a severe blow to two prominent hotels in Hyderabad with 20 lakhs fine

విద్యుత్ క్రాస్ సబ్సిడీ సర్ చార్జ్ డిమాండ్ నోటీసులు

కోర్టులో దాఖలైన ఈ కేసు విషయానికి వస్తే. అబిడ్స్ లోని బి సుందర్ రావు హోటల్స్ తాజ్ మహల్ హోటల్, సికింద్రాబాద్లోని సుందర్ తాజ్ మహల్ హోటల్స్ (హోటల్ తాజ్ 3 స్టార్) ఈ రెండు హోటల్స్ కు టీజి ఎస్ పి డి సి ఎల్ విద్యుత్ క్రాస్ సబ్సిడీ సర్ చార్జ్ డిమాండ్ నోటీసులను జారీ చేసింది.

సర్ చార్జ్ చెల్లించాలన్న విద్యుత్ పంపిణీ సంస్థ.. కోర్టులో రిట్

ఇందులో భాగంగా ఒక హోటల్ కు 27.5 లక్షల రూపాయలు, మరో హోటల్ కు 77.7 లక్షల రూపాయలు సర్చార్జి చెల్లించాలని నోటీసుల లో పేర్కొంది. అయితే తాము రైన్ కాల్సైనింగ్ సంస్థ నుండి నేరుగా విద్యుత్ కొనుగోలు చేస్తున్న కారణంగా 2005 నాటి నిబంధనల ప్రకారం తాము ఎలాంటి సర్ చార్జ్ చెల్లించాల్సిన అవసరం లేదని సదరు హోటల్ యాజమాన్యాలు కోర్టులో తమ వాదన వినిపించాయి.

గతంలో కేసు వేసి ఉపసంహరించుకున్నారని వాదన

అయితే పిటిషనర్ వాదనతో విభేదించిన టీజీ ఎస్పీడీసీఎల్ తరపు న్యాయవాది ఈ డిమాండ్ నోటీసులపై గతంలో హైకోర్టులో కేసులు వేసి, తరువాత ఎటువంటి అనుమతి లేకుండా ఉపసంహరించుకున్నారు అని వాదన వినిపించారు. బకాయిలను వాయిదాలలో చెల్లించేందుకు గతంలో విద్యుత్ సంస్థను ఆశ్రయించారని కూడా ఈ సందర్భంగా పేర్కొన్నారు.

సీరియస్ అయిన కోర్టు.. 20 లక్షల జరిమానా

దీనికి సంబంధించిన ఆధారాలను కోర్టు దృష్టికి తీసుకు వెళ్లడంతో, ఆగ్రహించిన కోర్టు కోర్టును తప్పుదారి పట్టించినందుకు ఆ రెండు హోటల్స్ కు 20 లక్షల రూపాయలు జరిమానా విధిస్తున్నట్లు పేర్కొంది. ఈ మొత్తాన్ని తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవ అథారిటీకి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+