తెలంగాణ అంశంపై కాంగ్రెసు కోర్ కమిటీ సీరియస్

సమావేశంలో తెలంగాణ సమస్య తీవ్రతను, రాష్ట్రంలో పరిస్థితిని కోర్ కమిటీ సభ్యులకు వివరించారు. ఆయన వివరించడమే తప్ప కోర్ కమిటీ సభ్యులు ఎవరు కూడా నోరు విప్పలేదని తెలుస్తోంది. తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికి సంప్రదింపులు వేగంగా జరగాలని ఆయన సూచించినట్లు చెబుతున్నారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నాయకుల అభిప్రాయాలను ఆయన వివరించినట్లు చెబుతున్నారు. సమావేశం నుంచి సోనియా గాంధీ సీరియస్‌గా బయటకు వెళ్లిపోయారు. సమస్య తీవ్రతను గుర్తించడం వల్లనే ఆమె ఆలా వెళ్లిపోయారని అంటున్నారు. అయితే, ఆమె ఆరోగ్యం సరిగా లేకపోయినప్పటికీ సమావేశానికి హాజరయ్యారు.
కాగా, తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించడానికి సమయం పడుతుందని సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణపై, ఆజాద్ సమర్పించిన నివేదికపై చర్చించామని ఆయన చెప్పారు. సమస్య శాశ్వత పరిష్కారానికి ఆజాద్ సూచనలు చేసినట్లు కూడా చెబుతున్నారు. మొత్తం మీద, తెలంగాణపై ఏమీ తేల్చకుండానే కోర్ కమిటీ సమావేశం ముగిసింది. అయితే, కాంగ్రెసు అధిష్టానం సమస్య తీవ్రతను గుర్తించింది కాబట్టి దాని పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications