ప్రధానిని కలిసి వివరిస్తా: ఢిల్లీ బయలుదేరుతూ కెసిఆర్

ఉద్యోగ సంఘాల నేత స్వామి గౌడ్, తెరాస శాసనసభ్యులు హరీష్ రావు తదితరులపై పోలీసులు హత్యాయత్నం చేశారని ఆరోపించారు. ఎంత చెప్పినా ఇవి పునరావృతమవుతున్నాయన్నారు. దేశ చరిత్రలోనే తెలంగాణ ఉద్యమం సుదీర్ఘమైనదని సిద్దిపేట శాసనసభ్యుడు హరీశ్ రావు అన్నారు. ముఖ్యమంత్రి కేంద్రానికి తప్పుడు నివేదికలు ఇస్తున్నారని తాము వెళ్లి వాస్తవ పరిస్థితులను వివరిస్తామని చెప్పారు. తెలంగాణ వచ్చే వరకు సమ్మె విరమించేది లేదని ఉద్యోగ సంఘాల నేత స్వామి గౌడ్ అన్నారు.
అక్టోబర్ 3వ తేది నుండి తెలంగాణ వ్యాప్తంగా జిల్లాలో పరిశ్రమల నిరవధిక బంద్ ఉంటుందని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ అంతకుముందు కరీంనగర్‌లో చెప్పారు. తెలంగాణ వచ్చే వరకు ఉద్యమం ఆగదన్నారు. సకల జనుల సమ్మె ఇంత ఉధృతంగా జరుగుతున్నా కేంద్రం స్పందించక పోవడం సిగ్గు చేటన్నారు. సింగరేణి కార్మికుల సమ్మె మరింత ఉధృతం చేస్తామన్నారు. సమ్మెలో పాల్గొన్న కార్మికులకు జీతాలు చెల్లించేలా చర్యలు చేపడతామన్నారు.












Click it and Unblock the Notifications