హైదరాబాద్: సస్పెండైన ఓ ఇండియన్ పోలీసు సర్వీసు(ఐపిఎస్) అధికారిపై విచారణ చేయాల్సిందిగా ఆంధ్ర ప్రదేశ్ లోకాయుక్త శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. శ్రీరాం తివారీ అనే ఐపిఎస్ అధికారి రెండేళ్ల క్రితం సస్పెండయ్యారు. ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖను లోకాయుక్త ఆదేశించింది. రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మియాపూర్ పోలీసు హౌసింగ్ కార్పోరేషన్ భూ వివాదంలో ఆయన సస్పెండయ్యారు.
మియాపూర్ భూ బాధితులు రాష్ట్ర లోకాయుక్తను ఆశ్రయించి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించి న్యాయం చేయాల్సిందిగా కోరారు. దీంతో స్పందించిన లోకాయుక్త భూవివాదంలో విచారణ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.