వేడివేడిగా తెలంగాణ కాంగ్రెసు నేతల సమావేశం

సమావేశం నుంచి మంత్రులు జానారెడ్డి, సుదర్శన్ రెడ్డి, సారయ్య, శాసనసభ్యుడు రాజయ్య ఆర్థాంతరంగా వెళ్లిపోయారు. అయితే, తామంతా ఏకతాటిపై ఉన్నామని, తెలంగాణ రాష్ట్ర సాధనే తమ లక్ష్యమని పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ చెప్పారు. తెలంగాణ అంశంపై ఢిల్లీలో కొంత ప్రగతి కనిపిస్తోందని తెలంగాణ నాయకులు అభిప్రాయపడ్డారు. మరోసారి అధిష్టానంతో మాట్లాడి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం రాకపోతే రాజీనామాలు సమర్పించి హైదరాబాదు వెళ్లాలన్న ప్రతిపాదనపై ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. తెలంగాణపై కాంగ్రెసు మాత్రమే కాకుండా ఇతర పార్టీలు కూడా అభిప్రాయం చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వెంటనే రోడ్ మ్యాప్ వేయాలని పార్లమెంటు సభ్యుడు రాజయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతున్నామని పొన్నం ప్రభాకర్ అన్నారు. రాజీనామాలు చేసే విషయంపై పునరాలోచన చేస్తున్నట్లు శాసనసభ్యుడు రాజయ్య చెప్పారు.












Click it and Unblock the Notifications