దొంగ వేషాలతో అల్లుడు బాబు వస్తున్నాడు: లక్ష్మీపార్వతి

Laxmi Parvathi
విజయవాడ: దొంగ వేషాలు వేసుకుని తన అల్లుడు వస్తున్నాడని స్వర్గీయ ఎన్టీ రామారావు సతీమణి లక్ష్మీపార్వతి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై వ్యాఖ్యానించారు. రైతు వేషం వేసుకుని చంద్రబాబు వస్తున్నాడని ఆమె అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ రైతు ధర్నా కార్యక్రమంలో ఆమె శనివారం ప్రసంగించారు. చంద్రబాబు పాలనలో ఐదు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, నలుగురు రైతులను చంద్రబాబు కాల్పుల్లో చంపించారని ఆమె ఆరోపించారు.

లక్షలాది మంది రైతుల గుండెల్లో వైయస్ రాజశేఖర రెడ్డి నిలిచిపోయారని, ఆ నాయకుడు మరణించిన తర్వాత ఈ ప్రభుత్వం, కాంగ్రెసు ఏం చేస్తున్నాయో చూస్తున్నామని ఆమె అన్నారు. వైయస్సార్, ఎన్టీ రామారావుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని వైయస్ జగన్ వచ్చారని ఆమె అన్నారు. రైతులు వీధుల్లోకి వస్తుంటే ఏం చేయలేని చేతగాని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిలిచిపోయారని వైయస్సార్ కాంగ్రెసు అధికార ప్రతినిధి రోజా అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయం దండుగ అన్నారని, ఈ రోజు కాంగ్రెసు ప్రభుత్వాన్ని కాపాడడానికి చంద్రాబబు పనిచేస్తున్నారని ఆమె అన్నారు. రైతు బాంధవుడు వైయస్సార్ వారసుడు వైయస్ జగన్ ప్రజల ముందుకు వస్తున్నారని ఆమె అన్నారు.

జగన్ దీక్షను భగ్నం చేయడానికి కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ప్రయత్నించడం సిగ్గుచేటు అని ఆమె అన్నారు. కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు 32 మంది ఉన్నా రాష్ట్రానికి ఏమీ చేయడం లేదని ఆమె అన్నారు. రైతుల కోసం పార్లమెంటు సభ్యులు రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. వైయస్ జగన్‌ను దెబ్బ తీయడమే ప్రధాన లక్ష్యంగా ఉందని ఆమె అన్నారు. రైతులను మోసం చేసిన చంద్రబాబుకు పట్టిన గతి కాంగ్రెసు పార్టీకి పడుతుందని ఆమె అన్నారు. రైతులకు అన్ని సౌకర్యాలు కలగాలంటే వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆమె అన్నారు. జగన్ త్వరలో ముఖ్యమంత్రి అవుతారని, ప్రజల కష్టాలు తొలగిపోతాయని ఆమె అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+