దీపావళి లేపు తెలంగాణపై కాంగ్రెసు వైఖరి వెల్లడి?

తెలంగాణపై అఖిల పక్ష సమావేశానికి ఆహ్వానిస్తూ ఒకటి, రెండు రోజుల్లో కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం రాష్టానికి చెందిన రాజకీయ పార్టీలకు లేఖలు రాయనున్నట్లు ఎఐసిసి వర్గాలంటున్నాయి. ఇదే సమయంలో యుపిఎ భాగస్వామ్య పక్షాలతో కూడా కాంగ్రెసు సమావేశమవుతుందని అంటున్నారు. తెలంగాణపై తమకు ఇష్టమైన పద్ధతిలో వార్తాకథనాలు ఇస్తున్నారని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ తప్పు పట్టినప్పటికీ అటువంటి ఊహాగానాలు చేసే అవకాశాన్ని కాంగ్రెసు కల్పిస్తూనే ఉన్నది.
ప్రధాని మన్మోహన్ సింగ్ గానీ, ఇతర కాంగ్రెసు అధిష్టానం పెద్దలు గానీ కాంగ్రెసు తెలంగాణ నేతలకు ఏ విధమైన హామీ ఇవ్వడం లేదు. సంప్రదింపులు జరగాల్సి ఉందని, తెలంగాణ సమస్య పరిష్కారానికి మరింత సమయం అవసరమని అంటున్నారు. తనను కలిసిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ప్రతినిధి బృందానికి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కూడా ఏ విధమైన హామీ ఇవ్వలేదు.












Click it and Unblock the Notifications