తెలంగాణ ఉద్యమ తీవ్రత తెలుసు: కెసిఆర్‌తో ప్రధాని

అయితే, సాధ్యమైనంత త్వరలో తెలంగాణ అంశాన్ని తేలుస్తామని, అయితే సమ్మె విరమించాలని ఆయన అన్నారు. తెలంగాణపై రోడ్ మ్యాప్ ప్రకటిస్తే తప్ప తాము సమ్మె విరమించబోమని జెఎసి నేతలు ఆయనతో చెప్పారు. కాంగ్రెసు కోర్ కమిటీ సభ్యులతో, ముఖ్య నేతలతో, యుపిఎ భాగస్వామ్య పక్షాలతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని ప్రధాని చెప్పారు.
తెలంగాణలో ఆత్మహత్యలు జరగడం విషాదకరమని ఆయన అన్నారు. ఆత్మహత్యలు ఆపడానికి ప్రయత్నించాలని ఆయన జెఎసి నేతలకు సూచించారు. సమ్మె కాలానికి ఉద్యోగులకు జీతాలు ఇప్పించాలని, కరెంట్ కోత లేకుండా చూడాలని జెఎసి నేతలు ప్రధానిని కోరారు. ప్రధాని కెసిఆర్ ప్రతినిధి బృందంతో దాదాపు 40 నిమిషాల పాటు మాట్లాడారు. కెసిఆర్ ప్రతినిధి బృందం కలిసి వెళ్లిన వెంటనే కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి ప్రధానితో సమావేశమయ్యారు. ప్రధానిని కలిసిన తర్వాత కెసిఆర్ ప్రతినిధి బృందం ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్‌తో సమావేశమయ్యారు.












Click it and Unblock the Notifications