సిఎంకు ఆవేశం ఎక్కువైంది: జెఏసి చైర్మన్ కోదండరామ్

తెలంగాణ ప్రజల మనోభావాలను జాతీయ స్థాయిలో వివరించామన్నారు. తమ ఢిల్లీ పర్యటనపై విమర్శలు సరికాదన్నారు. తెలంగాణ సాధన కోసం కావాల్సిన అన్ని మార్గాలను అన్వేషించి వాటిని అమలు చేస్తామన్నారు. తెలంగాణలో జరిగే పండుగలను ఉద్యమానికి వేదికలుగా మార్చుకుంటామన్నారు. తెలంగాణ సమస్య పరిష్కారనికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ప్రధాని తమతో చెప్పారన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రకటించే వరకు సకల జనుల సమ్మె విరమించేది లేదని తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణకు అనుకూలంగా ప్రకటన రాకపోతే ఆ తర్వాత జరిగే పరిణామాలకు కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు.












Click it and Unblock the Notifications