ఢిల్లీ పర్యటనలో పురోగతి కనిపించింది: కోదండరామ్

Kodandaram
హైదరాబాద్: తమ ఢిల్లీ పర్యటన ద్వారా తెలంగాణ రాష్ట్ర సాధన పురోగతి కనిపించిందని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ మంగళవారం అన్నారు. ఢిల్లీ పెద్దలు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత, ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను గుర్తించారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైఖరి సమస్యను పరిష్కరించాలన్నట్లుగా లేదన్నారు. నెలాఖరు వరకు ఉద్యమ కార్యాచరణ రూపొందించామన్నారు. ఉద్యమ పంథా మార్చుకునేది లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు సకల జనుల సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. సీమాంధ్ర బస్సులపై జరిగిన దాడులు ఉద్దేశ్య పూర్వకంగా జరిగినవి కావన్నారు. తమ యుద్ధం కేంద్రం పైనే తప్ప సీమాంధ్ర ప్రజల పైన కాదన్నారు. కొందరు సీమాంధ్ర నేతలు మాత్రమే తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

సింగరేణి కార్మికులకు దసరా ఆడ్వాన్సులు చెల్లించేందుకు సింగరేణి సిఎండి ఒప్పుకున్నందు వలన చెన్నూరు శాసనసభ్యుడు నల్లాల ఓదేలు మంగళవారం సాయంత్రం తన దీక్షను విరమించారు. సింగరేణి కార్మికులకు అడ్వాన్సులు చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ సిఎండిని కలిసి అభ్యర్థించారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. దీంతో ఓదేలు రెండు రోజులుగా చేస్తున్న తన దీక్షను విరమించారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ తెలంగాణ ఇప్పుడు రాకపోతే మరెప్పుడూ రాదన్నారు. రాష్ట్రం కోసం ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+