దమ్ముంటే రాజీనామాలు ఆమోదించండి: కొండా సురేఖ

తాము పార్టీకి రాజీనామా చేసినప్పటికీ ఇప్పటి వరకు బొత్స ఆమోదించలేదని మరో శాసనసభ్యుడు గుర్నాథ్ రెడ్డి అన్నారు. తమ రాజీనామాలు ఆమోదిస్తే ప్రభుత్వం ఎక్కడ పడిపోతుందోనన్న భయం ఆయనను వెంటాడుతోందన్నారు. బొత్సకు దమ్ముంటే మొదట పార్టీకి తాము చేసిన రాజీనామాలు 24 గంటల్లో ఆమోదించాలన్నారు. ఆ తర్వాతే తమను ప్రశ్నించాలన్నారు. ఆయన వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. జగన్‌ను విమర్శించడం విడ్డురంగా ఉందన్నారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని గట్టు రామచంద్రా రావు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సర్కారుపై ధ్వజమెత్తారు. రాష్ట్ర రైతాంగాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications