తెలంగాణపై వెంటనే తేల్చండి: రాహుల్‌తో చిరంజీవి

తిరుపతి శాసనసభ్యుడు, కాంగ్రెసు నాయకుడు చిరంజీవి శుక్రవారం రాహుల్ గాంధీని కలిశారు. తాను రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగానే కలిశానని చిరంజీవి భేటీ అనంతరం చెప్పారు. సోనియా గాంధీని కలుసుకోవడానికి చిరంజీవి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, సోనియా గాంధీ ఆపాయింట్‌మెంట్ ఆయనకు లభించలేదు. తెలంగాణపై తాము మల్లగుల్లాలు పడుతున్న నేపథ్యంలో చిరంజీవిని కలిస్తే తెలంగాణ పార్టీ నేతలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఉద్దేశంతో సోనియా చిరంజీవికి అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని అంటున్నారు.
సోనియా గాంధీ శస్త్రచికిత్స కోసం అమెరికాలో ఉండడంతో చిరంజీవి అప్పట్లో రాహుల్ గాంధీ సమక్షంలోనే కాంగ్రెసు పార్టీలో చేరారు. అది కూడా హడావిడిగా జరిగిపోయింది. అమెరికా నుంచి తిరిగి రావడంతో సోనియాను మర్యాదపూర్వకంగా కలవాలని అనుకుంటున్నట్లు చిరంజీవి చెప్పారు. చిరంజీవి కాంగ్రెసులో చేరగానే తెలంగాణ ఆందోళన ఉధృతమైంది. దీంతో కాంగ్రెసులో చిరంజీవి పాత్రను ఖరారు చేసే విషయంపై పార్టీ అధిష్టానం దృష్టి సారించలేని స్థితిలో పడింది.












Click it and Unblock the Notifications