రైల్ రోకోపై ప్రభుత్వానికి హరీష్ రావు హెచ్చరిక

Harish Rao
మెదక్: తాము ఈ నెల 9, 10, 11 తేదీల్లో తలపెట్టిన రైల్ రోకోను అడ్డుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైల్ రోకోను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలుంటాయని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వానిది రెండంచెల విధానమైతే తమది మూడంచెల విధానమని ఆయన అన్నారు. పెద్దయెత్తున తెలంగాణవాదులు పాల్గొని రైల్ రోకోను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

రైల్ రోకోను విజయవంతం చేయడానికి అవసరమైతే తాము ఆరంచెల విధానాన్ని అనుసరిస్తామని ఆయన అన్నారు. ఈసారి రైల్ రోకోలో అత్యధిక సంఖ్యలో మహిళలు పాల్గొంటారని ఆయన చెప్పారు. రైల్ రోకోను అడ్డుకుంటే తొమ్మిదో జాతీయ రహదారిపై ఇటీవల నెలకొన్న పరిస్థితులు నెలకొంటాయని ఆయన అన్నారు. రైలు పట్టాలపై ఎడ్లబండ్లను, వాహనాలను తరలించి రైళ్లను అడ్డుకుంటామని ఆయన చెప్పారు. పోలీసులకు భయపడాల్సిన అవసరం లేదని, తెలంగాణ ప్రజలను అరెస్టు చేస్తే జైలు భరో కార్యక్రమం చేపడతామని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+