తెలంగాణను దేవుడు కూడా ఆపలేడు: కేశవరావు

తెలంగాణ ప్రజలంతా కథానాయుకులేనని ఆయన అన్నారు. తెలంగాణ రాకపోతే చచ్చేది తామేనని ఆయన అన్నారు. విదేశీ సంస్కృతి నుంచి స్వదేశీ సంస్కృతిని రక్షించుకోవడానికే అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బండారు దత్తాత్రేయ అన్నారు. ఇది రాజకీయ, సాంస్కృతిక సందేశాన్ని అందిస్తుందని ఆయన చెప్పారు. తెలంగాణ సంస్కృతికి ప్రత్యేకత ఉందని, అందుకే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడు గద్దర్, గాయకుడు గోరటి వెంకన్న కూడా పాలు పంచుకున్నారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల జెఎసి నేత స్వామిగౌడ్ ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు వి. హనుమంతరావు, మధుయాష్కీ, హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి, తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి రెండు కళ్ల సిద్ధాంతం చెప్పారని స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అన్నారు. తెలుగుదేశం తెలంగాణ నాయకులు తమ హామీని నిలబెట్టుకోలేదని ఆయన అన్నారు. ఏం చేయాలో తెలుగుదేశం తెలంగాణ నాయకులు నిర్ణయించుకోవాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications