రాష్ట్రపతి పాలన పుకార్లపై నర్సింహన్ నో కామెంట్

Narasimhan
తిరుమల: రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని చెలరేగుతున్న పుకార్లపై మాట్లాడడానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ నిరాకరించారు. ప్రస్తుత పరిస్థితులను రాష్ట్రపతి పాలన విధించడంతో సరిపెట్టే అవకాశాలున్నాయా అని మీడియా ప్రతినిధులు అడిగితే మాట్లాడడానికి ఆయన నిరాకరించారు. తిరుమల నుంచి హైదరాబాద్ బయలుదేరే ముందు ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్ర పరిస్థితులను ఢిల్లీ పెద్దలకు వివరిస్తారా అని అడిగితే ఢిల్లీ వెళ్లినప్పుడు మౌనంగా ఉండలేం కదా అని ఆయన అన్నారు. రాష్ట్ర పరిస్థితులను కేంద్ర ప్రభుత్వానికి వివరిస్తానని ఆయన చెప్పారు.

ప్రభుత్వం బాగానే ఉందని ఆయన అన్నారు. తిరుమలలో చక్రస్నానం చేస్తూ అస్వస్థతకు గురైనట్లు వచ్చిన వార్తలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. సంచలనం సృష్టించడానికి అలాంటి వార్తలు రాయడం తనకు అసహ్యం కలిగిస్తుందని ఆయన అన్నారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, తన ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తాను పూర్తి ఫిట్నెస్‌తో ఉన్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆయన శుక్రవారం సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. శనివారం ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, కేంద్ర హోం మంత్రి పి. చిదంబరాలను కలుస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+