తెలంగాణపై తెగేసి చెప్పిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

తెలంగాణ ప్రజల ఆకాంక్ష తనకు తెలుసునని ఆమె చెప్పారు. తాము అన్ని విషయాలను తమ కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి తెలియజేస్తూనే ఉన్నామని ఆమె అన్నారు. ప్రభుత్వం నుంచి బయటకు రావాల్సి వచ్చినప్పుడు తాము అందరం కలిసే నిర్ణయం తీసుకుంటామని ఆమె చెప్పారు. రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసునని, పరిస్థితులు ఎలా ఉన్నా అందరం కలిసి పనిచేయాల్సి ఉంటుందని ఆమె అన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందినవారిగా తమ సమస్యలను, ప్రజల ఆకాంక్షను తమ పార్టీ అధిష్టానానికి తెలియజేస్తూనే ఉన్నామని ఆమె అన్నారు. తెలంగాణ ప్రజలు దసరాను మొక్కుబడిగా చేసుకున్నారని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications