హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ యోధుడు రాజ బహదూర్ గౌర్ కన్నుమాత

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, తొలి తరం కమ్యూనిస్టు నేత, కార్మిక సంఘాల నాయకుడు రాజ బహదుర్ గౌర్ శుక్రవారంనాడు కన్నుమూశారు. తీవ్రమైన జ్వరంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 93 ఏళ్లు. స్వాతంత్ర్యానికి పూర్వం ఆయన పలు కార్మిక సంఘాలను నిర్మించారు. అఖిల హైదరాబాద్ కార్మిక సంఘాల మండలి వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి ఆయన. దానికి ముఖ్దూం మొయియుద్దీన్ అధ్యక్షుడు. హైదరాబాద్ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడినన కామ్రేడ్స్ అసోసియేషన్ ఏర్పాటులో గౌర్ కీలక పాత్ర పోషించారు

జైలులో ఉండగానే ఆయన 1952లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయనను విడుదల చేయాలని రాజ్యసభకు ఎన్నికైన తర్వాత భారత ప్రభుత్వం ఆదేశించింది. ఉర్దూలో మంచి ప్రావీణ్యం గల గౌర్ అంజుమన్ తరక్కి ఉర్దూ అధ్యక్షుడిగా ఉన్నారు. పరిశోధనల నిమిత్తం గౌర్ భౌతిక కాయాన్ని ఉస్మానియా వైద్య కళాశాలకు అప్పగించనున్నట్లు సిపిఐ రాష్ట్ర సమితి ఓ ప్రకటనలో తెలిపింది. గౌర్ మృతికి పలువురు నాయకులు సంతాపం ప్రకటించారు.

English summary
A leading light of the Telangana Armed Struggle, a first generation communist leader and veteran trade unionist Raj Bahadur Gaur passed away here on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X