తెలంగాణపై ఏం చెప్పానో వెల్లడించను: జైపాల్ రెడ్డి

రాష్ట్రపతి పాలన అంశం ప్రస్తావనకు రాలేదని, తాను దానిపై ఏమీ చెప్పలేనని ఆయన అన్నారు. మినీ కోర్ కమిటీ సభ్యుల ఆలోచన ఏ విధంగా ఉందో తనకు తెలియదని ఆయన అన్నారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి అన్వేషణ జరుపుతున్నారని, అందులో భాగంగానే చర్చలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. రాష్ట్రానికి చెందిన నలుగురు కేంద్ర మంత్రులతోనూ మినీ కోర్ కమిటీ సభ్యులు విడివిడిగా చర్చలు జరిపారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి చెప్పారు. రాష్ట్రాభివృద్దే తమ లక్ష్యమని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications