గాలి కేసు: మహిళా ఐఎఎస్ అధికారిని ప్రశ్నించిన సిబిఐ

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి)కి 2005 - 2009 మధ్య మంజూరు చేసిన కొన్ని లీజుల్లో అక్రమాలు జరిగినట్లు సిబిఐ అధికారులు గుర్తించారు. ఆ సమయంలో శ్రీలక్ష్మి ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్నారు. ఒఎంసికి లీజులు మంజూరు చేసిన వ్యవహారంలో కొంత మంది ప్రభుత్వాధికారులు కుట్రలు చేశారా అనే విషయంపై సిబిఐ అధికారులు దృష్టి పెట్టారు. గత నెలలో సిబిఐ అధికారులు గునులు, జియాలజీ మాజీ డైరెక్టర్ విడి రాజగోపాల్‌ను కూడా సిబిఐ అధికారులు ప్రశ్నించారు. గనుల అక్రమ తవ్వకాల కేసులో సిబిఐ అధికారులు గాలి జనార్దన్ రెడ్డిని, ఒఎంసి మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి సెప్టెంబర్ 5వ తేదీన అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications