కాంగ్రెసు ఆఫీసులో తెలంగాణ లొల్లి, గాల్లోకి కుర్చీలు

gandhi bhavan
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవనంలో ఆదివారం కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ సమక్షంలోనే కాంగ్రెసు కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఉదయం గాంధీ భవనంలో యువజన కాంగ్రెసు నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అడ్డుకున్న తెలంగాణ కాంగ్రెసు నేతలు తెలంగాణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఇందుకు పార్టీ నేతలు ఒప్పుకోక పోవటంతో తెలంగాణ కార్యకర్తలు కుర్చీలు విసిరేశారు. సభ్యత్వ నమోదు జరగనిచ్చేది లేదని హెచ్చరించారు.

తెలంగాణకు ప్రత్యేక కమిటీ వేయకుంటే తెలంగాణ వచ్చాకే యువజన నమోదు కార్యక్రమం చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి అదుపు తప్పటంతో నమోదు కార్యక్రమాన్ని మూడు నెలలు వాయిదా వేశారు. అనంతరం తెలంగాణ కాంగ్రెసు కార్యకర్తలు మాట్లాడుతూ సభ్యత్వ నమోదు సరికాదన్నారు. నమోదు చేస్తే తెలంగాణ ద్రోహులుగా పరిగణిస్తామన్నారు. పోలీసులు మమ్మల్ని కార్యాలయం నుండి తరమడం సరికాదన్నారు. ఇలా అయితే తెలంగాణ వచ్చేకే సభ్యత్వ నమోదు జరిపిస్తామన్నారు. కాగా గాంధీ భవనంలోని గొడవపై పిసిసి చీఫ్ ఆరా తీశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+