తెలంగాణ జెఏసితో శతృత్వం లేదు: గద్దర్

ప్రజా ఫ్రంట్ చేసిన ఉద్యమాల ద్వారానే తెలంగాణపై కేంద్రంలో కదలిక వచ్చిందన్నారు. ఇక ముందు కూడా అదే స్థాయిలో ఉద్యమిస్తామని చెప్పారు. వచ్చే పార్లమెంటు సమావేశాలలో కేంద్రం తెలంగాణ బిల్లు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితితో ఎలాంటి శతృత్వం లేదన్నారు. తెలంగాణ అంశంపై సంప్రదింపుల పేరుతో కేంద్రం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఈ నెల20 నుంచి ఉద్యమం ఉధృతం చేస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications