వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జెఏసి చైర్మన్ కోదండరామ్ అరెస్టు, విడుదల

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kodandaram
వరంగల్: తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరాంను ఆదివారం పోలీసులు అరెస్టు చేసి విడుదల చేశారు. సింగరేణికి బస్సుయాత్ర ద్వారా వెళుతున్న కోదండరామ్‌తో సహా పదిహేను మందిని వరంగల్ జిల్లా పెంబర్తి గ్రామంలో పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ఉదయం హైదరాబాదు నుండి సింగరేణికి జెఏసి బస్సుయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. రెండు బృందాలుగా బయలుదేరిన జెఏసి ఓ బృందం కొత్తగూడం, మరో బృందం గోదావరిఖని బయలుదేరింది. కోదండరామ్ కొత్తగూడం బృందంలో ఉన్నారు. ఆయనను పెంబర్తి వద్ద అరెస్టు చేశారు. కరీంనగర్ మీదుగా వెళుతున్న గోదావరిఖని బృందం యాత్రకూ పోలీసులు బ్రేక్ వేశారు. సిరిసిల్ల మండలం జిల్లెలగడ్డ వద్ద బస్సుయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. మాజీ మంత్రి నాయిని తదితరులను సిరిసిల్ల పోలీసు స్టేషన్ తరలించారు.

కోదండరాంను పోలీసులు హైదరాబాదు తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. కోదండరాం అరెస్టును తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, కాంగ్రెసు సీనియర్ నేత కె కేశవరావు, ఎంపీ విజయశాంతి తదితరులు ఖండించారు. అరెస్టు విషయం తెలిసిన తెలంగాణవాదులు ఆలేరు, భువనగిరి రహదారిపై బైఠాయించారు. కోదండరాంను హైదరాబాదు తరలించకుండా అడ్డుకుంటామని పోలీసులను హెచ్చరించారు. దీంతో హైదరాబాద్ - వరంగల్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం అయింది. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ తాము శాంతియుతంగా ఉద్యమిస్తుంటే తనను ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు. ఉద్యమకారులను ప్రభుత్వం రెచ్చగొడుతుందని విమర్శించారు. ప్రభుత్వం రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలన్నారు.

కాగా కోదండరాంను హైదరాబాదు తరలిస్తుండగా నల్గొండ జిల్లా ఆలేరు గ్రామంలో తెలంగాణవాదులు అడ్డుకున్నారు. ఆలేరు, భువనగిరి, ఘట్‌కేసర్ తదితర గ్రామాల్లో భారీగా తెలంగాణవాదులు పోలీసులను అడ్డుకోవడానికి సిద్ధమయ్యారు. అయితే ఆలేరులోనే భారీగా గుమికూడిన తెలంగాణవాదులు ఎంతకూ పోలీసులు వాహనాన్ని కదలనివ్వక పోవడంతో దిగొచ్చిన పోలీసులు కోదండరాంను విడుదల చేశారు. అయితే తనను ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలంటూ కోదండరాం రోడ్డుపైనే బైఠాయించారు. తన అరెస్టుకు తెలంగాణవాదులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

English summary
Police arrested Telangana Political JAC chairman Kodandaram today in Pembarthi of Warangal district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X