వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా వర్సిటీల్లో ఇక సెక్స్ పాఠాలు తప్పనిసరి!

By Srinivas
|
Google Oneindia TeluguNews

china
బీజింగ్: ప్రేమ, సెక్స్ పాఠాలను ఇక నుండి విశ్వవిద్యాలయాల్లో తప్పని సరి చేయాలంటూ చైనా దేశ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే అవి మనస్తత్వ శాస్త్ర కోర్సులో భాగంగా బోధించే ఏడు చాప్టర్లలో రెండు చాప్టర్లట. మిగతా చాప్టర్లలో ఒత్తిడిని జయించడం ఎలా తదితర అంశాలుంటాయట. నాలుగు నెలల కిందట జూన్‌లోనే అక్కడి విద్యాశాఖాధికారులు ఒక తప్పనిసరి మానసిక ఆరోగ్య కోర్సును రూపొందించాల్సిందిగా అన్ని వర్సిటీలకు సూచించారు. ఈ నేపథ్యంలో ఇప్పటి నిర్ణయం మరికొద్ది రోజుల్లో అమల్లోకి రానుంది.

నిజానికి ఇలాంటి కోర్సులు లోగడ చాలా కాలేజీల్లో ఉండేవి గానీ అవి ఐచ్ఛికంగా మాత్రమే ఉండేవట. విద్యార్థులు ఒత్తిడిని ఎలా తట్టుకోవాలో తెలియజెప్పే ఇలాంటి కోర్సులుమార్గదర్శకంగా ఉంటాయనే ఉద్దేశంతోనే వీటిని తప్పనిసరి చేశామని ఆయన వివరించారు. అయితే ఈ నిర్ణయంపై అక్కడి విద్యార్థులు మిశ్రమ భావాలు వ్యక్తం చేస్తున్నారట. ఈ నిర్ణయంపై కొందరేమో ఉత్సాహం ప్రదర్శిస్తుండగా మరికొందరు ఇవి బోర్ సబ్జెక్టులుగా పేర్కొంటున్నారట.

English summary
China’s Ministry of Education has made the Psychology of Love and Sex a mandatory subject for all universities nationwide.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X