తెలంగాణ అంశం: అధిష్టానం ముందుకు చిరంజీవి

ఆదివారం సాయంత్రం హైదరాబాదు నుండి ఢిల్లీ బయలుదేరే చిరంజీవి రాత్రే కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాదుతో భేటీ అయ్యే అవకాశం ఉంది. సోమవారం ప్రణబ్ ముఖర్జీ, ఎకె ఆంటోనీ, చిదంబరంలతో భేటీ అయ్యే అవకాశం ఉంది. వారితో భేటీలో తెలంగాణపై చిరు తన నిర్ణయం చెబుతారు. రాష్ట్రంలో ప్రధాన సమస్య అయిన తెలంగాణ అంశం విషయంలో చిరంజీవికి ప్రాధాన్యత ఇవ్వాలని భావించిన అధిష్టానం ఆయనను పిలిపించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు కావూరి సాంబశివ రావు ఢిల్లీ వెళ్లి చిరంజీవితో, విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌తో సమావేశం కానున్నారు. ఆ తర్వాత ప్రణబ్‌తో భేటీ కానున్నారు.












Click it and Unblock the Notifications