పులివెందుల పిఎస్ ముందు వైయస్ జగన్ ధర్నా

YS Jagan
కడప: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం సాయంత్రం కడప జిల్లా పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. తమ పార్టీ కార్యకర్తలను అరెస్టు చేసినందుకు నిరసనగా జగన్ పోలీసు స్టేషన్ ముందు బైఠాయించారు. తమ పార్టీ కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యకర్తలపై పోలీసులు దౌర్జన్యానికి దిగుతున్నారని ఆరోపించారు. తన పార్టీ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటున్నారని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతకాలంగా తమ పార్టీ కార్యకర్తలపై పోలీసులు వివక్ష చూపిస్తున్నారన్నారు.

కాగా వైయస్సార్సీ పార్టీ కో-ఆర్డినేటర్లను ఆదివారం నియమించారు. పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర సమన్వయకర్తగా చిత్తర్పు నాగేశ్వర రావు, ప్రోగ్రామ్ కమిటీ కో ఆర్డినేటర్‌గా తలశిల రఘురాం నియమితులయ్యారు. మీడియా కమిటీ రాష్ట్ర సమన్వయకర్తగా ఎం వెంకట ప్రసాద్, ఐటి వింగ్ కో ఆర్డినేటర్‌గా చల్లా మధుసాధన్ రెడ్డిలను నియమించారు. మరోవైపు రాష్ట్రంలోని అప్రకటిత విద్యుత్ కోతకు నిరసనగా వైయస్సార్సీ ఈ నెల 11న ఆందోళనకు సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళన నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ధర్నాలు రైతులు పాల్గొనాలని పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+