వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రం నిర్ణయానికి కట్టుబడి ఉంటా: తెలంగాణపై చిరు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
న్యూఢిల్లీ: తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానని తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి సోమవారం న్యూఢిల్లీలో అన్నారు. సకల జనుల సమ్మె కారణంగా రాష్ట్రంలో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ సమస్య వెంటనే పరిష్కరించాలని తాను కోర్ కమిటీని కోరినట్లు చెప్పారు. తెలంగాణపై నిర్ణయానికి ఇదే సరైన సమయమన్నారు. సమైక్యాంధ్ర అన్న తన అభిప్రాయంలో ఎలాంటి మార్పు లేదని అయితే అధిష్టానం నిర్ణయానికి మాత్రం కట్టుబడి ఉంటానని చెప్పారు. ఎలాంటి పరిణామాలకైనా తాను సిద్ధంగా ఉన్నానన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితి అల్లకల్లోలంగా ఉందన్నారు.

కాగా అంతకుముందు మినీ కోర్ కమిటీ భేటీలో చిరంజీవితో పాటు ఏఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరి పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, చిదంబరం, గులాం నబీ ఆజాద్‌తో భేటీ అయిన చిరంజీవి తెలంగాణపై తన నిర్ణయాన్ని వారికి చెప్పారు. మరోవైపు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తెలంగాణపై తన నివేదికను పంపించారు.

English summary
Tirupati MLA Chiranjeevi said today that he will committed for High Command's decesion on Telanganaissue. He met mini core committee and said his openion on issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X